చిరంజీవి బయోపిక్ లో హీరో నేనే!

12 0

చిరంజీవి బయోపిక్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. మెగాస్టార్ సినీజీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తే బాగుంటుందని హీరో వరుణ్ తేజ్ కూడా అభిప్రాయపడ్డాడు. అక్కడితో ఆగకుండా.. అవకాశం వస్తే చిరంజీవి పాత్ర పోషించడానికి కూడా రెడీ అని ప్రకటించాడు. ఇంతకీ ఆ బయోపిక్ డైరక్టర్ ఎవరో తెలుసా? అక్షరాలా హరీష్ శంకర్.

“చిరంజీవి బయోపిక్ తీస్తానని హరీష్ శంకర్ నాతో అన్నాడు. నాతో మాత్రం తీస్తానని అనలేదు. చిరంజీవిని నేను లవ్ చేసినంతగా ఎవ్వరూ లవ్ చేయలేదు, మెగాస్టార్ బయోపిక్ తీస్తే నేనే తీస్తానంటున్నాడు హరీష్. చిరంజీవిగారి బయోపిక్ చరణ్ అన్న చేస్తేనే బాగుంటుంది. చరణ్ అన్న చేయకపోతే మాత్రం నెక్ట్స్ నేనే.”

ఇలా చిరంజీవి బయోపిక్ మేటర్ ను బయటపెట్టాడు వరుణ్ తేజ్. హరీష్ ఈ బయోపిక్ ను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకొస్తాడో తనకు తెలియదని, కానీ ఏదో ఒకరోజు చిరంజీవి బయోపిక్ ను హరీష్ చేస్తాడని అంటున్నాడు వరుణ్. తనకు చిరంజీవి పాత్ర పోషించే అవకాశం వస్తే మాత్రం గ్రాఫిక్స్ లో హైట్ తగ్గించుకుంటానని కూడా చెబుతున్నాడు.

చిరంజీవి బయోపిక్ పై ఇప్పటికే కొంతమంది మెగా కాంపౌండ్ వ్యక్తులు స్పందించారు. మెగాస్టార్ బయోపిక్ కు ఇంకా చాలా టైమ్ ఉందని గతంలో చిరంజీవి, అల్లుఅర్జున్ అభిప్రాయపడగా.. అసలు చిరంజీవి కెరీర్ ను సినిమాగా తీయకుండా ఉంటేనే బెటరని ఆమధ్య నాగబాబు అభిప్రాయపడ్డాడు.

మరోవైపు వరుణ్ తేజ్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో కూడా ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో… చిరంజీవి బయోపిక్ ను టచ్ చేయకుండా ఉండడమే బెటర్ అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Add Comment